Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 1, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో పెరుగుతున్న కరోనా.. 59కి చేరిన కేసులు!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్లీ కలవరపెడుతోంది.
కొత్తగా 9 కేసులు నమోదు కావడంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది.
ఇప్పటివరకు ఈ వైరస్ రాష్ట్రంలోని 15 జిల్లాలకు విస్తరించడం గమనార్హం.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 6, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.మొత్తంగా చూస్తే విశాఖ, రాజమండ్రిలో అత్యధికంగా 11 కేసులు చొప్పున రికార్డయ్యాయి.
అధికారులు అప్రమత్తమై ఇప్పటివరకు 531 మందికి టెస్టులు నిర్వహించారు.
కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.



